Share News

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:06 AM

కల్లూరు అర్బనలోని వార్డుల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బనలోని వార్డుల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం 28వ వార్డులోని లక్ష్మీపురం, పందిపాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, రోడ్డు వైడింగ్‌ పనులకు రూ.2.23 కోట్లతో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ముందుగా లక్ష్మీపురంలో ఎస్సీ కాలనీలో రూ.40 లక్షలతో పూర్తి చేసిన సామూహిక మరుగుదొడ్లను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లా డుతూ పందిపాడులో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు, 32వ వార్డు ముజఫ ర్‌నగర్‌లో రూ.1.53 కోట్లతో రోడ్డు వైడింగ్‌ పనులకు ప్రాంరంభించా మన్నారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కే.పార్వతమ్మ, మాజీ జడ్పీ చెర్మన ఏ.వెంకటస్వామి, టీడీపీ వార్డు ఇన చార్జి లక్ష్మీరెడ్డి, చిన్నమారెన్న, శివ, రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి పందిపాడు నాయకులు దేవేంద్రారెడ్డి, పాల శంకర్‌, అయ్యపురెడ్డి, ముజఫర్‌నగర్‌ టీడీపీ నాయ కులు టైలర్‌ నాగరాజు, ఖాజా, బందేనవాజ్‌, మురళీగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:06 AM