Share News

క్రమశిక్షణ కలిగిన నేత నారా లోకేశ్‌

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:55 PM

క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నారా లోకేశ్‌ పేరు తెచ్చుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

క్రమశిక్షణ కలిగిన నేత నారా లోకేశ్‌
కే క్‌ కట్‌ చేస్తున్న టీడీపీ జిల్లా నాయకులు

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ

కర్నూలు అర్బన్‌, జనవరి 23(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నారా లోకేశ్‌ పేరు తెచ్చుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, బొందిలి కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా పార్టీలో కార్యకర్తలను చేర్పించడంలో తన సత్తా చాటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్పొరేషన్ల డైరెక్టర్లు సంజీవలక్ష్మి, మారుతి, ముంతాజ్‌ బేగం, నంద్యాల నాగేంద్ర, లక్ష్మినారాయణ, అబ్బాస్‌, అకెపోగు ప్రభాకర్‌, సోమిశెట్టి నవీన్‌, హనుమంతరావు చౌదరి, గున్నామార్కు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:55 PM