రేపు జాతీయ ఓటరు దినోత్సవం
ABN , Publish Date - Jan 23 , 2026 | 11:46 PM
16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి తెలిపారు.
కర్నూలు కలెక్టరేట్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి తెలిపారు. కర్నూలు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి ఓటర్ల ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ ఏడాది ‘నా భారతదేశం - నా ఓటు అనే థీమ్’తో కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. అదే రోజు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సీనియర్ ఓటర్లు కొత్తగా నమోదైన ఓటర్లకు సన్మానం ఉంటుందన్నారు.