పత్తికొండలో నిలిచిన టమోటా విక్రయాలు
ABN , Publish Date - Feb 06 , 2026 | 11:47 PM
పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం నుంచి టమోటా విక్రయాలు నిలిపివేస్తున్నట్లు యార్టు కార్యదర్శి కార్నలీస్ తెలిపారు.
పత్తికొండ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం నుంచి టమోటా విక్రయాలు నిలిపివేస్తున్నట్లు యార్టు కార్యదర్శి కార్నలీస్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్ కోసం ఆగస్టు3వ తేదీ టమోటా మార్కెట్ ప్రారంభించామన్నారు. రబీ సీజన్ టమోటాతోపాటు హంద్రీనీవా కింద తోటలలో సాగైన టమోటా దిగుబడిని మార్కెట్‌లో వ్యాపారులు కొంటూ వచ్చారన్నారు. అయితే ప్రస్తుతం అక్కడక్కడ కొద్ది చోట్ల మాత్రమే పంట దిగుబడులు ఉండడంతో వ్యాపారుల విన్నపం మేరకు శనివారం నుండి టమోటా కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించామన్నారు. రైతులు టమోటా దిగుబడిని అమ్మకానికి తీసుకురావద్దని తెలిపారు.