టామోటా.. ఊరట
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:08 PM
టామోటా రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో టామోటా సాగైంది.
రోజురోజుకూ పెరుగుతున్న ధరలు
ఈ వారంలో కిలో రూ.50
సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): టామోటా రైతులకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో టామోటా సాగైంది. గత మూడు నెలలుగా టామోటా ధరలు దారుణంగా పడిపోయాయి. కానీ వారం రోజులుగా టామోటా ధరలు రోజురోజుకూ పెరగడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. పది రోజుల క్రితం కిలో రూ 5 కూడా ధర పలుకకపోవడంతో టామోటా రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. ప్రస్తుతం 20 కిలోల బాక్స్ ధర రైతు పొలం వద్దే సుమారు రూ 700- రూ 800 దాకా పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో టామోటా ధర నాణ్యతను బట్టి రూ 40 నుంచి రూ 50 దాకా విక్రయిస్తున్నారు. గత మూడు నెలలుగా తీవ్రంగా నష్టపోయిన టమోటా రైతులకు ఈ ధరలు ఊరట కలిగిస్తున్నాయి. ధమోటా దిగుబడి తగ్గిపోవడంతోనే ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో వారం, పది రోజుల్లోనే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.