టమోఠా
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:17 AM
టమోటా దరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత డిసెంబరులో 25 కేజీల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. అయితే ప్రస్తుతం 25 కేజీల బాక్సు రూ.వందకే పరిమితం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
కేజీ రూ.4కి పడిపోయిన టమోటా ధర
పంటను పొలంలో వదిలేసిన రైతులు
చాగలమర్రి, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): టమోటా దరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత డిసెంబరులో 25 కేజీల బాక్సు రూ.800 నుంచి రూ.వెయ్యి పలికింది. అయితే ప్రస్తుతం 25 కేజీల బాక్సు రూ.వందకే పరిమితం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఎకరాకు రూ.1.5 లక్షల పెట్టుబడి
టమోటా సాగుచేయడానికి ఎకరాకు రూ.1.5లక్షలు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. ఇందులో నారు దగ్గ నుంచి కూలీలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చులు ఉన్నాయి.
తగ్గిన దిగుబడి
సాధారణంగా ఎకరాకు 25 బాక్సులు పైనే దిగుబడి రావాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 7 నుంచి 10 బాక్సులు మాత్రమే వచ్చినట్లు రైతులు వాపోతున్నారు. మండలంలోని కొలుములపేట గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున్‌రెడ్డి ఎకరం పొలంలో సాగుచేసిన టమోటాలను పొలంలోనే వదిలేశారు. దిగుబడి తగ్గి ధర లేకపోవడంతో చేసేదేమీలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాయలు కోసే కూలీలకు కూడా డబ్బు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి, గిట్టుబాటు ధర కల్పించాలని లేదా ప్రభుత్వమే కొనుగోలుచేయాలని రైతులు కోరుతున్నారు.