ట'మోత'
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:47 PM
మూడు నెలల నుంచి సామాన్యులకు అందుబాటులో ఉన్న టామోటా ఒక్కసారిగా కొండెక్కింది.
సంజామలలో కిలో రూ.60, బెంబేలెత్తుతున్న వినియోగదారులు
సంజామల, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల నుంచి సామాన్యులకు అందుబాటులో ఉన్న టామోటా ఒక్కసారిగా కొండెక్కింది. గతంలో కిలో రూ.10, రూ.20కే దొరకగా ఇప్పుడు రూ.60కి చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం వారపు సంతలో వ్యాపారులు కిలో టామోటా ఽధర రూ.60 విక్రయిస్తుండడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోయారు. ధర పెరిగిన అవవసరమైన టామోటాను కొనుగోలు చేసి సర్దుకుపోయారు.