లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:14 AM
ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి(ఎఫ్‌ఏసీ) పి.వాసు పోలీసు అధికారులను కోరారు
కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి పి. వాసు
కర్నూలు లీగల్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి(ఎఫ్‌ఏసీ) పి.వాసు పోలీసు అధికారులను కోరారు. గురువారం ఆయన తన ఛాంబరులో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులే కాక ప్రిలిటిగేషన్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్‌లలో పరిష్కరిస్తారని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులతో పాటు సివిల్ కేసులు కూడా పరిష్కరిస్తారని, ఆయా కోర్టులలో ప్రస్తుతం జరుగుతున్న ప్రిలోక్ అదాలత్ సిట్టింగులలో తమ కేసులను పరిష్కరించుకోడానికి చర్చించుకోవాలని ఆయన అధికారులను కోరారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, కర్నూలు అడిషనల్ ఎస్పీ హుస్సేన్‌పీరా, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్యనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు