16న పరిశుద్ధ ఆలయ ప్రతిష్ఠ
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:45 AM
మండలంలోని పెద్దబోదనం గ్రామంలో నిర్మించిన సీఎ్‌సఐ చర్చి పత్రిష్ఠ ఈనెల 16న పాస్టర్ చెంచుల రవింద్రనాథ్ శనివారం తెలిపారు.
చాగలమర్రి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దబోదనం గ్రామంలో నిర్మించిన సీఎ్‌సఐ చర్చి పత్రిష్ఠ ఈనెల 16న పాస్టర్ చెంచుల రవింద్రనాథ్ శనివారం తెలిపారు. నంద్యాల డయాసిస్ బిషప్ సంతో్‌షప్రసన్నరావు, మహిళా ఫెలోషిప్ ప్రెసిడెంట్ బ్యూలా సంతోష్ ప్రారంభిస్తారన్నారు. చర్చి ఆరాదన, గుడి ప్రదక్షిణ, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని అన్నారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజేంద్రబాబు, కోశాధికారి నందం ఇషాక్, అసోషియేట్ ట్రెజరర్ బండి శామియల్, ఆయా చర్చిల ఫాదర్లు పాల్గొంటారని అన్నారు. నూతన చర్చి ప్రారంభోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని చర్చి ఫాదర్ కోరారు.