కలిసి కట్టుగా స్వచ్ఛ అహోబిలం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:12 PM
కలిసి కట్టుగా ‘స్వచ్ఛ అహోబిలం’ ద్విగ్విజయంగా నిర్వహించామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అ న్నారు.
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): కలిసి కట్టుగా ‘స్వచ్ఛ అహోబిలం’ ద్విగ్విజయంగా నిర్వహించామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అ న్నారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో కోనేరు శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కళాశాలల విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు కలిసి ఎన్నో ఏళ్లుగా అపరి శుభ్రంగా ఉన్న కోనేరును శుభ్రం చేసి అందులోని చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహోబిలంలో గతం కంటే ఇప్పుడు భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించు కోవడానికి వస్తున్నారన్నారు. స్వామి ప్రసాదంపై కూడా ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆలయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘స్వచ్ఛ అహోబిలం’ విజయవంతం కావడం కృషి చేసిన వలంటీర్లను, మున్సిపల్, పోలీసు, ఫైర్ శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. శుభ్రం చేసిన కోనేరులో ఎమ్మెల్యే దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నూర్జహాన్, ఆలయ సీఈవో రామానుజన్, కౌన్సిలర్ హుస్సే న్‌బాషా, టీడీపీ మండల కన్వీనర్ శీలం హరికుమార్‌రెడ్డి, నాయకులు వంశీకృష్ణా, పాపిరెడ్డి, పెద్ద ప్రసాద్, సానే సూరేష్, కామినేని ధనుంజయ పాల్గొన్నారు.