నేడు పరిషత్ ఎన్నికలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:12 AM
మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 ఏకగ్రీవం కాగా, 7ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలు యాపదిన్నె, దొరపల్లె, ఎద్దుపెంట, ఉంగరానిగుండ్ల, చనుగొండ్ల, కమలాపురం, కామగానిగుంట్లలో ఇరు పార్టీల అభ్యరుథలు పోటీ చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో సిబ్బందికి ఆర్‌వో రామాంజనేయులు సామగ్రి అందజేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, బందోబస్తు ఏర్పాటు చేశారు.
డోన్, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో నిర్వహణ
సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
డోన్ టౌన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 11 ఏకగ్రీవం కాగా, 7ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ స్థానాలు యాపదిన్నె, దొరపల్లె, ఎద్దుపెంట, ఉంగరానిగుండ్ల, చనుగొండ్ల, కమలాపురం, కామగానిగుంట్లలో ఇరు పార్టీల అభ్యరుథలు పోటీ చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో సిబ్బందికి ఆర్‌వో రామాంజనేయులు సామగ్రి అందజేశారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆళ్లగడ్డ: 10 ఎంపిటీసీ, జడ్పిటీసీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆర్‌వో హరిగోపాల్ తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. 33 పోలింగ్ కేంద్రాలలో 210 మంది సిబ్బంది, నలుగురు మైక్రో అబ్జర్వర్లు నియమించాని, మొత్తం 28,825 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, ఎంఈవో శోభావివేకవతి పాల్గొన్నారు.
జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు..
శిరివెళ్ల: మండంలో 15ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆర్వో చిలకల విజయ శేఖర్, ఏఆర్వో శివ మల్లేశ్వరప్ప బుధవారం తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సామగ్రిని పీవోలకు అప్పగించామన్నారు. 53 పోలింగ్ కేంద్రాల పరిధిలో 11 అత్యంత సమస్యాత్మక, 31 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, మిగిలిన 11 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో 47,958 మంది ఓటర్లు ఉండగా, 23,845 మంది పురుషులు, 24,112 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారన్నారు. కాగా గోవిందపల్లె గ్రామంలోని ఎంపీటీసీ 2 స్థానాలను టీడీపీ, వైసీపీ చెరొకటి ఏకగ్రీవం చేసుకున్నాయి. సమస్యాత్మక కేంద్రాలపై నిఘా ఉంచామని సీఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి తెలిపారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన అన్నారు.
ఉయ్యాలవాడ: మండలంలో 6 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌వో నాగముణేశ్వరి తెలిపారు. 23,112 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె కోరారు. 32 పోలింగ్ కేంద్రాల్లో 20 మంది సిబ్బంది, ఇద్దరు ఎస్‌ఐలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎస్‌ఐ రామిరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు
చాగలమర్రి: మండలంలో 15ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిచనున్నట్లు ఆర్‌వో సునిల్‌ఖన్న తెలిపారు. తహసీల్దార్ పవన్‌కుమార్‌రెడ్డి, ఎంపీడీవో తాహిర్‌హుసేన్, ఏవో రాజేంద్రప్రసాద్ సామగ్రిని పంపిణీ చేశారు. కేంద్రాల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.
ప్యాపిలి: ఎంపీటీసీ ఎన్నికల సామాగ్రిని ఆర్వోలు సోమా శివారెడ్డి, శ్రీనివాసరావు పంపిణీ చేశారు. 21 ఎంపీటీసీలకు గాను 19 స్థానాలు, జడ్పీటీసీ ఏకగ్రీవమయింది. మాధవరం, జక్కసానికుంట్ల ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. సీఐ వెంకటరామిరెడ్డి, జలదుర్గం, ప్యాపిలి ఎస్‌ఐలు అనిల్‌కుమార్, నాగార్జున బందోబస్తు ఏర్పాటు చేశారు.
రుద్రవరం: మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆర్‌వో మనోరంజన్ ప్రతాప్ బుధవారం తెలిపారు. 44 పోలింగ్ కేంద్రాలు నాలుగు జోన్లు, ఐదు రూట్లుగా విభజించామని 273 మంది సిబ్బంది ఇప్పటికే కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. ఏఆర్‌వోలు భాగ్యలక్ష్మి, నాగవీణ, జోనల్ అధికారులు కమాల్‌సాహెబ్, సుమతి పాల్గొన్నారు. కాగా మండలంలో 37,974 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 18,907, మహిళలు 19,065 ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ రఫి పోలీసులకు సూచించారు.
దొర్నిపాడు: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌వో నాగరాజు, ఎంపీడీవో సావిత్రి తెలిపారు. మండలంలో 7 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీకి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.
బనగానపల్లె నియోజకవర్గంలో 5 జడ్పీటీసీలు, 85 ఎంపీసీటీసీలు ఉండగా కృష్ణగిరి ఎంపీటీసీ తప్ప మిగతావి ఏకగ్రీవమయ్యాయి.