Share News

నేడు లక్ష్మీమాధవుడి గరుడోత్సవం

ABN , Publish Date - Mar 07 , 2026 | 12:19 AM

మండలంలోని గోరంట్ల లక్ష్మీమాధవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

నేడు లక్ష్మీమాధవుడి గరుడోత్సవం
విద్యుద్దీపాలంకరణలో గోరంట్ల లక్ష్మీమాధవుడి ఆలయం

తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కల్యాణం

రెండు గ్రామాల ప్రజలే పెద్దలు

కోడుమూరు రూరల్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గోరంట్ల లక్ష్మీమాధవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం వేకువజామున స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించ నున్నారు. ఈ కల్యాణ తంతును రెండు గ్రామాల ప్రజలు పెద్దలుగా ఉంటూ జరిపిస్తారు. ఈక్రతువులో వధువు తరపున గోరంట్ల, వరుడికి ఎర్రగుడి గ్రామాల ప్రజలు పెద్దలుగా ఉంటారు. ఇందులో భాగంగా వరుడింటి వారు ప్రభను తయారు చేసి మేళాల మధ్య హంద్రీనది గుండా గోరంట్ల ఆలయం చేరుకుంటారు. ఆ తదుపరి వరుడు మాధవుడిని తోడ్కొని వధువు ఆశీనులైన ఆచారుల ఇంట కేగి గోరంట్ల ప్రజలతో పేరంటమాడతారు. కానుకలు వగైరాలు మాట్లాడు తారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలో పెళ్లిమండపం చేర్చి వేద మంత్రోచఛరణల మధ్య కల్యాణం జరిపిస్తారు. అనంతరం గరుడ వాహ నంపై ఉంచి లాగుతారు. గరుడవాహనంలో ముందువైపు ఎర్రగుడి, వెనుక భాగాన గోరంట్ల ప్రజలు ఉంటూ నడిపిస్తారు. గరుడ వాహనాన్ని ముందు కులాగే ప్రయత్నాన్ని ఆపేందుకు గోరంట్ల ప్రజలు యత్నించే సన్నివేశం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. కాగా బ్రహ్మోత్సవాలను పురస్కరిం చుకుని ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.

Updated Date - Mar 07 , 2026 | 12:19 AM