ప్రాణాలకు ముప్పు పొగాకు : డీఎంహెచ్‌వో
ABN , Publish Date - May 30 , 2026 | 11:38 PM
పొగాకు ఆరోగ్యానికి ప్రాణాలకు ముప్పు అని డీఎంహెచ్‌వో డాక్టర్ వై.కామేశ్వర ప్రసాద్ హెచ్చరించారు.
కర్నూలు హాస్పిటల్, మే 30 (ఆంధ్రజ్యోతి): పొగాకు ఆరోగ్యానికి ప్రాణాలకు ముప్పు అని డీఎంహెచ్‌వో డాక్టర్ వై.కామేశ్వర ప్రసాద్ హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎన్‌సీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ఏ రూపంలో ఉన్న ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందన్నారు. సిగరెట్ తాగడం వల్ల అందులో ఉన్న 4వేల రకాల రసాయనాలు మనిషి అవయవాల్లో చేరి తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోని వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ విభాగం ఆఫీసర్ ఎల్.భాస్కర్, ఎన్‌సీడీ జిల్లా నోడల్ అధికారి మహేశ్వరప్రసాద్, డీపీఎంయు శైలేష్ కుమార్, డీఎంవో వెంకటేశ్వర్లు, డెమో ప్రకాష్‌రాజ్, ఈగల్ టీమ్ సీఈవో వేణుగోపాల్, సృజన, మాసూంవలి పాల్గొన్నారు.