ఈ దఫా ఎంపీపీ పీఠం ఎవరికో?
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:42 PM
మండల పరిషత్ వ్యవస్థను 1985 మే 25న నాటి సీఎం నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టారు.
ఐదుసార్లు భూమా అనుచరుల విజయం
రుద్రవరం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్ వ్యవస్థను 1985 మే 25న నాటి సీఎం నందమూరి తారకరామారావు ప్రవేశపెట్టారు. 1987 జనవరి 15 నుంచి మండల పరిషత్ అమల్లోకి వచ్చింది. అశోక్మెహతా కమిటీ సిఫారసు ఆధారంగా మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలంలో ఐదుసార్లు భూమా వర్గీయులు ఒక్కసారి గంగుల వర్గీయులు ఎంపీటీసీలుగా గెలిచారు. మొదటిసారి రంగముని, రెండోసారి అభ్యర్ధి వేమయ్య, మూడోసారి రాణెమ్మ, నాలుగోసారి సత్యవేణమ్మ, అయిదో దఫా దేవి, ఆరో అభర్ధి బాలస్వామి ఎంపీపీలుగా కొనసాగారు .కాగా ఈ సారి ఎంపీపీ స్థానం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది.