ఉద్యోగ కల్పనే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:43 AM
యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాను ఎంపీ బస్తీపాటి నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఓర్వకల్లులో భారీ పెట్టుబడులకు చర్యలు
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్‌మేళాను ఎంపీ బస్తీపాటి నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అధ్వర్యంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పిస్తూ భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులను కేబినేట్ ఆమోదం లభించిందని, పార్ట్‌నర్ షిప్ సమ్మిట్‌లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. కర్నూలు జిల్లా వనరులు, భోగోళిక అనుకూలతలను సద్వినియోగం చేసుకుని ఓర్వకల్లు ప్రాంతానికి సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి చర్యలు చేపట్టామన్నారు. ఐఎ్‌సఎం పాలసీ కింద అనుమతులు, క్లియరెన్స్‌లు లభిస్తే ఓర్వకల్లులో సుమారు రూ.23 వేల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. రిలయన్స్ అధ్వర్యంలో ఓర్వకల్లులో మరో ఫుడ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేస్తున్నామన్నారు. కర్నూలు జిల్లాకు ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్లు కూడ అందుబాటులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి, కళాశాల డీన్ శౌరిల్ తదితరులు పాల్గొన్నారు.