Share News

‘సర్‌’ వేగవంతం కోసం..

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:14 PM

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ను వేగ వంతం చేయాలని ఎలె క్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

‘సర్‌’ వేగవంతం కోసం..
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్‌

నేడు, రేపు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు

కర్నూలు ఆర్వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు అర్బన్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ను వేగ వంతం చేయాలని ఎలె క్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. శుక్రవారం బుధవారపేట 122, 123, 124, 192, 193 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించి, 2002 ఓటర్‌ జాబితాను 2026 జాబితాతో సరిపోల్చి, స్వయంగా ఎన్యుమరేషన్‌ ఫారాలు పూరించారు. రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఈ ఆర్వో, బిఎల్వోలకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఎస్‌ఐఆర్‌లో ఎన్యుమరేషన్‌ ప్రక్రియకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. విద్యావంతులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల ఉద్యోగులు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగస్వామ్యం కావచ్చని, తమ వీధిలో ఉన్న ఓటర్లకు ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తి చేయడంలో సహకారం అందించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగస్వామి కావాలని సూచించారు. శని, ఆదివారాల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు బీఎల్‌వోలు, సూపర్వైజర్లు అందుబాటులో ఉండి, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్వో ధనుంజయ్‌, సూపర్వైజర్లు వేణు ప్రియ, రసూల్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:14 PM