Share News

ఎన్నికలకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:47 PM

ఈ నెల 26న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ రాజకుమారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠకు వివరించారు.

ఎన్నికలకు పటిష్ట భద్రత
కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 26న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ రాజకుమారి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠకు వివరించారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. నంద్యాల కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి ఫణికుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి విడత ఎన్నికల్లో జిల్లాలోని 8 మండలాల పరిధిలో 107 గ్రామ పంచాయతీలు, 975 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని కమిషనర్‌కు వివరించారు.

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ శాఖలపై సానుకూల అభిప్రాయం పెంపొందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్లో కీ పర్ఫామెన్స్‌ ఇండికేటర్స్‌, పాజిటివ్‌ పబ్లిక్‌ రిసెప్షన్‌ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులతో సమీక్షించారు.

Updated Date - Nov 24 , 2026 | 11:47 PM