Share News

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:28 PM

సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఆస్పరిలో ‘సంజీవని’ ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ ఏ. సిరి అన్నారు.

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత
పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిరి

కలెక్టర్‌ ఏ.సిరి ఫ 1,600 మంది పోలీసులతో బందోబస్తు

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

ఆస్పరి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ఆస్పరిలో ‘సంజీవని’ ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్‌ ఏ. సిరి అన్నారు. శుక్రవారం ఆమె ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విధుల్లో పాల్గొనే పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిం చాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ 1,600 మంది పోలీసు సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించామన్నారు. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, 13 మంది డీఎస్పీలు, 75 మంది సీఐలు, 103మంది ఎస్‌ఐలు, 226 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, 353 మంది కానిస్టేబుళ్లు, 95 మంది వివిధ విభాగాల పోలీసులు విధులు నిర్వహిస్తారన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:28 PM