నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:58 AM
మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
వెల్దుర్తి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం వెల్దుర్తి, బొమ్మిరెడ్డిపల్లి, చెరుకులపాడు గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో అనవసర వ్యక్తుల సంచారాన్ని నియంత్రించాలని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పీతో పాటు పత్తికొండ డీఎస్పీ వంశీధర్‌గౌడు, సీఐలు రామయ్య నాయుడు, యుగంధర్, మహమ్మద్‌గౌస్, చిరంజీవి, ఆదిలక్ష్మీ, విజయలక్ష్మీ, ఎస్‌ఐ నరేశ్ ఉన్నారు.