Share News

ఉత్సవాలకు గట్టి బందోబస్తు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:47 PM

రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో అంత్యంత ముఖ్యమైన 30 మధ్యరాధన, 31న మహారథోత్సవాన్ని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

ఉత్సవాలకు గట్టి బందోబస్తు
శ్రీమఠం అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

మంత్రాలయం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో అంత్యంత ముఖ్యమైన 30 మధ్యరాధన, 31న మహారథోత్సవాన్ని గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. శనివారం శ్రీమఠం అధికారులు మఠం ఏఏవో మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసులు, సురేష్‌ కోణాపూర్‌, ఐపీ నరసింహామూర్తితో కలిసి మంత్రాలయం సీఐ దస్తగిరిబాబు, రామాంజులు ఆధ్వర్యంలో తుంగభద్ర నదీతీరం, మధ్వమార్గ్‌ కారిడార్‌, కల్పతరువు క్యూ కాంప్లెక్స్‌, వీఐపీ, సేవాకర్తలు, సర్వదర్శన క్యూలైన్లు, ఓవర్‌ బ్రిడ్జి, అన్నపూర్ణ భోజనశాల, మఠం ప్రాంగణం, ప్రధాన రహదారులు వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళిక ద్వారా సీసీ కెమెరాలతో నిఘా ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. అనుమానిత ప్రదేశాల్లో బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. 200మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో 8మంది సీఐలు, 12మంది ఎస్‌ఐలు, 42మంది ఏఎ్‌సఐ, హెడ్‌కాన్సిస్టేబుల్‌, 80 మంది పోలీసులు, 40 మంది హోంగార్డులు, 11మంది మహిళా కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్‌ పోలీసులు ఉంటారని చెప్పారు. కేటాయించిన ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో మాధవరం, మంత్రాలయం ఎస్‌ఐలు విజయ్‌కుమార్‌, మల్లికార్జున, సెక్యూరిటీ ఇన్‌చార్జి రమేష్‌, ఎస్‌బీ సీఐ మధుసూదన్‌, ఇనాయితుల్లా, సత్యనారాయణ, శేఖర్‌, పోలీసులు పాల్గొన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పూజలు చేశారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు శేషవస్త్రం ఇచ్చి ఆశీర్వదించారు. ఎస్పీ వెంట అనంతపురాణిక్‌, వ్యాసరాజాచార్‌, మురళీధర్‌రెడ్డి, రంగస్వామి, రామకృష్ట,మఠం, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:47 PM