Share News

లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:23 PM

నంద్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు
మాట్లాడుతున్న మంత్రి, పక్కన కలెక్టర్‌, జేసీ

రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల నియోజకవర్గ పరిధిలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి స్థలం, టిడ్కో ఇల్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అధికారులను ఆదేశించారు. మంగవారం నంద్యాలలోని రాష్ట్ర ప్రభుత్వ అతిఽథి గృహంలో కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌తో కలిసి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో టిడ్కో ఇళ్ల కేటాయింపు, రిజిస్ర్టేషన్‌, ఖాళీగా ఉన్న ఇళ్ల వివరాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. ఇంటి పట్టాల కోసం ఆన్‌లైన్‌లో దాదాపు 7వేల మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హతలను నిర్ధారించాలన్నారు. అర్హులందరికీ పట్టాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత, నిబంధనల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రయోజనం అందేలా అధికారులు పనిచేయాలన్నారు. హౌసింగ్‌ ఈఈ, టిడ్కో ఈఈ, నంద్యాల మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్డీఓ, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2026 | 11:23 PM