త్వరలో టిడ్కో ఇళ్లు
ABN , Publish Date - Aug 25 , 2026 | 10:58 PM
నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో ఉన్న టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల టౌన్, ఆగష్టు 25(ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో ఉన్న టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. మంగళవారం ఆయన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ తాగునీరు, డ్రైనేజీ, మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నాణ్యంగా చేయాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ సొంతింటి కల నేరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. అన్ని హంగులతో ఇళ్లను పూర్తి చేసి త్వరలోనే అందజేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్, నాయకులు బుగ్గరాముడు, పబ్బతివేణు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.