Share News

పులకించిన ఉరుకుంద

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:21 PM

ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా మూడో సోమవారం ఉరుకుంద క్షేత్రం ఈరన్న నామస్మరణతో మారుమోగింది.

పులకించిన ఉరుకుంద
దారులన్నీ భక్తులతో నిండిన దృశ్యం

ఈరన్న స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు

దర్శనానికి గంటల కొద్ది సమయం

కౌతాళం, ఆగస్టు 31(ఆంఽధ్రజ్యోతి): ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా మూడో సోమవారం ఉరుకుంద క్షేత్రం ఈరన్న నామస్మరణతో మారుమోగింది. స్వామి దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి స్వామి సన్నిధిలో దర్శనానికి భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం సుమారు 2గంటలకు పైగా సమయం పట్టింది. శ్రావణ మాసంలో మూడో సోమవారానికి ప్రత్యేకత ఉండటంతో ఒక్కరోజే సుమారు 4నుంచి 5లక్షల దాగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే దారులలో ఏటు చూసినా భక్తజనంతో నిండిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచే భక్తులు ఉరుకుందకు తరలి వచ్చారు. ఆలయ అర్చకులు శ్రావణ మాసపు సోమవారం స్వామి వారి మూలవిరాట్‌ను వెండి అలంకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి వారి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినా దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టినది. కొందరు భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పొర్లుదండాలతో స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు. మరికొంత మంది భక్తులు స్థానిక ఎల్‌ఎల్‌సీ కాలువలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారి దర్శనానికి తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక నైవేద్యాలను వండి స్వామి వారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. క్షేత్రానికి నాలుగు వైపుల పోలీసులు ట్రాఫిక్‌ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వెలుపల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉరుకుంద-కోసిగి రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడానికి

స్వామి వారి సన్నిధిలో ఎస్పీ

శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఆదోని డీఎస్పీ రమణ, కౌతాళం సీఐ యుగంధర్‌ ఉన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:21 PM