ముగ్గురు డైరెక్టర్లు ఏకగ్రీవం
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:35 PM
విజయ డెయిలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం విజయ డెయిరీలో ఎన్నికల అధికారి హరిబాబు ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.
విజయ డెయిరీలో ముగిసిన ఎన్నికల ప్రక్రియ
ఊపిరి పీల్చుకున్న పోలీసు యంత్రాంగం
నంద్యాల రూరల్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): విజయ డెయిలో ఖాళీగా ఉన్న మూడు డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం విజయ డెయిరీలో ఎన్నికల అధికారి హరిబాబు ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. మూడు డైరెక్టర్ల స్థానాలకు గాను ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ మండలం శాంతినగరం సొసైటీకి సంబంధించి గంగుల ప్రమీలరాణి, బండిఆత్మకూరుకు సీమ రవికాంతరెడ్డి, శిరివెళ్ల మండలం గంగవరానికి ఉడత రమణ నామినేషన్ దాఖలు చేశారు. ఒక డైరెక్టర్ స్థానం మహిళకు, రెండు స్థానాలు పురుషులకు ఉండగా.. ఒక మహిళ, ఇద్దరు పురుషులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో మూడు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి హరిబాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తాలూకా సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చేపట్టారు.