Share News

జ్వాలా నరసింహస్వామికి తొట్టి తిరుమంజనం

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:38 PM

అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఉభయ నాచ్చియర్లతో తిరుచ్చిపై ఉత్సవం నిర్వహించారు.

జ్వాలా నరసింహస్వామికి తొట్టి తిరుమంజనం
ప్రత్యేక అలంకారంలో జ్వాలా నరసింహస్వామి అమ్మవార్లు

ఆళ్లగడ్డ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఉభయ నాచ్చియర్లతో తిరుచ్చిపై ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛీప్‌ అడ్మినిస్ట్రేటర్‌ పార్థసారథి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, ఆర్చకులు మనియర్‌ సౌమ్యనారాయణ న్‌ స్వామి, అమ్మ వార్లకు తొట్టి తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అశ్వ వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. అలాగే దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాద వదర స్వామి వారికి నవ కళశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు.

Updated Date - Apr 28 , 2026 | 11:38 PM