కామెంట్లు చేసే వారే టార్గెట్
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:34 PM
సైబర్ క్రైమ్‌లో మరో కొత్తకోణం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో మహిళలకు కామెంట్లు చేసే వ్యక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసే అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు ఇరువురిని కోవెలకుంట్ల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
సైబర్ క్రైమ్‌లో మరో కొత్త కోణం
అంతర్రాష్ట్ర సైబర్ క్రైం ముఠా అరెస్టు
రెండు నెలల్లో రూ.15 లక్షలకు పైగా దోపిడీ
కోవెలకుంట్ల వ్యక్తిని బెదిరించి రూ.30 వేలు వసూలు
కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : సైబర్ క్రైమ్‌లో మరో కొత్తకోణం వెలుగుచూసింది. సోషల్ మీడియాలో మహిళలకు కామెంట్లు చేసే వ్యక్తులను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసే అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ ముఠా సభ్యులు ఇరువురిని కోవెలకుంట్ల పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, కోవెలకుంట్ల సీఐ హనుమంత్‌నాయక్ తెలంగాణ రాష్ట్రం జడ్చర్లకు చెందిన సైబర్ క్రైమ్ ముఠా నిందితులు అక్కంపల్లి చంద్రశేఖర్, దాసరి సందీ్‌పకుమార్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాలు.. కోవెలకుంట్లకు చెందిన కర్నాటి ప్రతాపరెడ్డి త్రేడ్స్ యాప్‌లో ఓ మహిళకు కాల్ మీ .. అంటూ తన నెంబరును పోస్ట్ చేశాడు. దీన్ని గమనించిన మొదటి నిందితుడు చంద్రశేఖర్ గత నెల 28న కర్నాటి ప్రతాపరెడ్డికి ఫోన్‌చేసి నేను గద్వాల ఎస్‌ఐని మాట్లాడుతున్నానంటూ నమ్మబలికాడు. నువ్వు గద్వాల కండక్టర్ భార్యకు మేసేజ్ చేశావు. కండక్టర్ భార్యను కొట్టడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి నువ్వు డబ్బు చెల్లించి సెటిల్ చేసుకో లేదంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించాడు. భర్త కండక్టరుతో మాట్లాడాలంటూ రెండవ నిందితుడు దాసరి సందీ్‌పకుమార్‌తో మాట్లాడించాడు. భయపడిన ప్రతాపరెడ్డి రూ.4లక్షలకు బేరం కుదుర్చుకొని వెంటనే రూ.30వేలు ఫోన్‌పే చేశాడు. మరుసటి రోజు ఆనంబరు స్వీచ్ ఆఫ్ రావడంతో గద్వాలకు ఫోన్‌చేసి విచారణ చేయగా అక్కడ ఎస్‌ఐ కాదు సీఐ ఉన్నాడన్న విషయం ప్రతాపరెడ్డికి తెలిసింది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ప్రతాపరెడ్డి గత నెల 30న సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి, కోవెలకుంట్ల పోలీ్‌సస్టేషన్‌లో పిర్యాదుచేశాడు.ప్రతా్‌పరెడ్డి ఫిర్యాదుతో..
సైబర్ క్రైమ్ కేసులో నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాలమేరకు కర్నాటి ప్రతాపరెడ్డి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తీగ లాగితే డొంక కదిలింది. సదరు ముఠా సభ్యులు సోషల్ మీడియాలో ఇలా ఆనేక మందిని టార్గెట్ చేసి, డబ్బు వసూలుకు పాల్పడుతున్నట్లు తేలింది. గత రెండు నెలల వ్యవధిలోనే సుమారు రూ.15లక్షలకు పైగా వసూలు చేసినట్లు తేలింది. నిందితులను అరె్‌స్టచేసి కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. ఈముఠాపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా వీరు ఈమార్గాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోందని అన్నారు. జిల్లాతో పాటు, తెలుగు రాష్ర్టాల్లో ఈ ముఠా సభ్యుల బారిన పడిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు.
సైబర్ క్రైమ్ కేసుల్లో..
సైబర్ క్రైమ్ కేసుల్లో ఇది కొత్త కోణంగా పోలీసులు పేర్కొంటున్నారు. మామూలుగా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం వివరాలు తెలపాలని మోసం చేయడం. మీకు లక్షల్లో నగదు వస్తుంది. కొంత నగదు ముందుగా డిపాజిట్ చేయండి అంటూ మోసాలకు పాల్పడ్డటం, డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి డబ్బు వసూలు చేయడం లాంటి ఘనటలు చోటు చేసుకుంటాయి. ఈముఠా మాత్రం సోషల్ మీడియాలో మహిళలపై వీక్‌నె్‌సతో మేసేజ్ పెట్టే వాళ్లను గుర్తించి, టార్గెట్ చేసే కొత్త కోణాన్ని ఎంచుకున్నారు. మహిళలకు అసభ్యంగా మేసేజ్ చేసిన వాళ్లను వివిధ మార్గాల ద్వారా గుర్తించడం, కామెంట్ నంబర్లు పోస్టు చేసి ఉంటే వారికి నేరుగా కాల్‌చేసి పోలీసులమంటూ రంగంలోకి దిగుతున్నారు. సదరు బాధితులు కూడా మ హిళలకు అసభ్యంగా కామెంట్ పోస్టు చేశామని భయపడి డబ్బులిచ్చి మౌ నంగా ఉంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో సైబర్ క్రైమ్‌లో వీరు సరి కొత్త కోణాన్ని ఎంచుకున్నారని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.