Share News

వైభవంగా తిమ్మగురుడు రథోత్సవం

ABN , Publish Date - Apr 13 , 2026 | 11:24 PM

భక్తుల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్న తిమ్మగురుడు స్వామి సంపూర్ణ రథోత్సవం సోమవారం వైభవంగా సాగింది.

వైభవంగా తిమ్మగురుడు  రథోత్సవం
అశేష భక్త జనుల మధ్య తిమ్మగురుడు స్వామి రథోత్సవం

వేలాదిమంది భక్తులతో కిక్కిరిసిన గూడూరు

గూడూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): భక్తుల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్న తిమ్మగురుడు స్వామి సంపూర్ణ రథోత్సవం సోమవారం వైభవంగా సాగింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో గూడూరు పట్టణం కిక్కిరిసింది. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రథోత్సవానికి హాజరై మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథాన్ని ముందుకు లాగారు. స్వామి వారి ఆలయంతో పాటు రథశాలను రంగురంగు విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. స్వామివారి నామస్మరణ చేస్తూ భక్తులు రథాన్ని లాగుతుండగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు మంచినీరు, మజ్జిగను పంపిణీ చేశారు. రథోత్సవం సందర్భంగా కోడుమూరు సీఐ తబ్రేజ్‌ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రథోత్సవంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు కురుకుంద రామాంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్‌ రేమట వెంకటేష్‌, మాజీ కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, పౌలు, తెలుగు శ్రీనివాసులు, మన్సుర్‌, నాగప్ప యాదవ్‌, సుమన్‌బాబు, డాక్టర్‌ మన్నన్‌బాష, పెద్ద చాంద్‌ బాష పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 11:24 PM