కత్తితో బెదిరించి దోచుకెళ్లారు
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:01 AM
మంత్రాలయం పట్టణం రాఘవేంద్రపురం కాలనీలోని వెంకటేష్ శెట్టి ఇంట్లో తలుపులు పగలకొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. నదితీరంలో బొమ్మల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ శెట్టి అతని భార్యతో కలసి బుధవారం రాత్రి బెంగళూరు వెళ్లారు.
మంత్రాలయం, ఆగ స్టు 20(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం పట్టణం రాఘవేంద్రపురం కాలనీలోని వెంకటేష్ శెట్టి ఇంట్లో తలుపులు పగలకొట్టి చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. నదితీరంలో బొమ్మల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ శెట్టి అతని భార్యతో కలసి బుధవారం రాత్రి బెంగళూరు వెళ్లారు. ఇంట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కూతురు రాశి ఉంది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటితాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. నిద్ర మేల్కొన్న రాశిని కత్తితో బెదిరించి బీరువాను పగలగొట్టి 4 తులాల బంగారు, రూ. 2 లక్షలు నగదు, బయట పార్కింగ్ చేసిన మోటార్ సైకిల్‌ను అపహరించుకొని వెళ్లారు. అదే కాలనీలో ఉంటున్న రవికి చెందిన మరో మోటార్ సైకిల్‌ను ఎత్తుకెళ్లారు. మంత్రాలయం ఎస్‌ఐ మల్లికార్జున సంఘటనల స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపారు.