దొంగల అరెస్టు
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:21 AM
నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన మూడు వరుసల ఇళ్ల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 23న నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసనగర్‌లో రిటైర్డు ఆర్‌ఎ్‌సఐ సుబ్బయ్య, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇళ్లలో చోరీ జరిగింది. భారీ ఎత్తున నగదు, నగలు చోరీ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు.
15 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలు రికవరీ
కర్నూలు క్రైం, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన మూడు వరుసల ఇళ్ల దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 23న నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాసనగర్‌లో రిటైర్డు ఆర్‌ఎ్‌సఐ సుబ్బయ్య, బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇళ్లలో చోరీ జరిగింది. భారీ ఎత్తున నగదు, నగలు చోరీ కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్స్, సెల్ టవర్ లోకేషన్ల ఆధారంగా వివరాలు సేకరించారు. దొంగతనాలకు పాల్పడింది హైదరాబాదుకు చెందిన సర్ఫరాజ్, ఖుర్రం ఆలి, షానావాజ్‌లుగా పోలీసులు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో లేటెస్టుగా వీరు ఉపయోగిస్తున్న సెల్‌లను గుర్తించారు. వీటి ఆధారంగా నిందితులను వెంబడించారు. వీరిలో షానవాజ్ పరారీ కాగా.. మిగతా ఇద్దరు నిందితులు దొరికారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణలతో పాటు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులు శనివారం కర్నూలు వచ్చి శివారు కాలనీలైన సంతో్‌షనగర్, సంపత్‌నగర్ తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండులో వాహనం ఆపుకొని వాహనంలో నిద్రించారు. ఆదివారం దొంగలు గుర్తించిన మూడు ఇళ్ల వద్దకు మరోసారి పరిశీలించారు. అప్పటికీ కూడా మూడు ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఆ ఇళ్లే చోరీకి అనుకూలమని భావించి చోరీ చేశారు. ఓ ఇంట్లో మాత్రం విలువైన వస్తువులు లభించలేదు. ఈ కేసు ఛేదనలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు, మురళి, శ్రీనివాసులు కీలకపాత్ర పోషించారు.