Share News

గుట్టుగా ప్రారంభించారు..!

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:05 AM

గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం ఏకంగా డోన్‌ ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు వైసీపీ నాయకులు. డోన్‌ నియోజకవర్గంలో ఈ ఘటన వివాదస్పదంగా మారింది.

గుట్టుగా ప్రారంభించారు..!
వైసీపీ నాయకులతో కలిసి ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

ఎవరికీ తెలియకుండానే ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ నాయకులు

జడ్పీ చైర్మన్‌తో పాటు వైసీపీ నాయకులపై కేసు

డోన్‌ టౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం ఏకంగా డోన్‌ ఎంపీడీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు వైసీపీ నాయకులు. డోన్‌ నియోజకవర్గంలో ఈ ఘటన వివాదస్పదంగా మారింది. ఈ ప్రారంభోత్సవం గురించి డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కాని, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డికి కాని తెలియకుండా ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో టీడీపీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల తీరు వైసీపీ ప్రభుత్వ హయాంలో చెలామణి చేసిన విధంగా కూటమి ప్రభుత్వంలోనూ దౌర్జన్యంగా గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటున ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించడం ఏమిటని మండిపడుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుకలు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యేకు, సంబంఽధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభిం చడం టీడీపీ నాయకుడు సుదీష్‌ ఆగ్రహం వ్యక్తం చేసి ఎంపీడీవో కార్యాలయ గేటు తాళాలను పగులకొట్టారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, అధికారులు జోక్యం చే సుకుని దౌర్జన్యంగా ఎంపీడీవో కార్యాలయం ప్రారంభించిన వైసీ పీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సుదీష్‌ డిమాండ్‌ చేశారు.

కేసు నమోదు

అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంచారని వైసీపీ నాయకులపై ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఎర్రిస్వామి, జడ్పీటీసీ రాజుకుమార్‌ యాదవ్‌, వైసీపీ నాయకులు సోమేశ్‌ యాదవ్‌, మల్లెంపల్లె రాజశేఖర్‌, జాకీర్‌ హుస్సేన్‌, మల్లికార్జునరెడ్డి, పోస్టు ప్రసాద్‌తో పాటు మరికొందరిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఇంతియాజ్‌ బాషా తెలిపారు.

Updated Date - Aug 24 , 2026 | 12:05 AM