Share News

కరువు మండలాలుగా ప్రకటించాలి

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:13 PM

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరును కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

కరువు మండలాలుగా ప్రకటించాలి
గొంతుకు ఉరితాళ్ల వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నాయకులు, రైతులు

సీపీఐ నాయకుల డిమాండ్‌

గొంతుకు ఉరితాళ్లు వేసుకుని వినూత్న నిరసన

ఎమ్మిగనూరు, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరును కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో రైతులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు గొంతుకు ఉరితాళ్ల వేసుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగన్న, భాస్కర్‌ యాదవ్‌, సోమేశ్వర రెడ్డి, మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ నీటి వనరులు సమృద్ధిగా ఉన్న నంద్యాల జిల్లాలో 29 మండలాల్లో 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, ఏమాత్రం నీటి వనరులు లేని కర్నూలు జిల్లాలో 27 మండలాలకు గాను 15 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోతే అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, గిడ్డయ్య, బజారి, మాలిక్‌, తిమ్మగురుడు, విజేంద్ర, వీరేష్‌, ఇస్మాయిల్‌, మల్లికార్జున, గోపాలు, రాములు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:13 PM