కరువు మండలాలుగా ప్రకటించాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:20 AM
జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేవీ నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం వ్యవసాయ, కౌలు రైతు సంఘాల అధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 4లక్షల 34 వేల 996 హెక్టార్లకు 3లక్షల 48 వేల 390 హెక్టార్లలో రైతులు పంటలు వేశారన్నారు. సుమారు ఒక లక్ష హెక్టార్ల వరకు పంటలు సాగుకాలే దన్నారు. అయితే అధికారులు 25 మండలాల్లో మూడు లక్షల 46 వేల 671 హెక్టార్ల వరకు పంట నష్టమైనట్లు ప్రభుత్వానికి నివేదికలు పం పించడం అన్యాయమ న్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావం ఉన్నప్పటికీ అందులో దాదాపు 50 శాతం లోటు వర్షపాతం కురిసినప్పటికీ కేవలం 6 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా, మరో ఐదు మండ లాలను మద్యస్థ కరువు మండలాలుగా ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించారన్నారు. జిల్లాలోని 27 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ, నాగన్న, సూరి, మనోహర్, ఆంజనే యులు, మధు, మద్దిలేటి పాల్గొన్నారు.