Share News

రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:48 PM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ర్టాన్ని అథోగతి పాలు చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారు
మాట్లాడుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

జగన్‌ పాదయాత్రలు చేయడం అవసరమా?

రెండున్నరేళ్లలోనే అభివృద్ధి పరుగులు

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

ఆదోని, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ర్టాన్ని అథోగతి పాలు చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ధ్వజమెత్తారు. మంగళవారం ఆదోనిలో జనసేన మండల నాయకులు నవీన్‌, బీజేపీ నాయకులు రామాంజనేయులు, దేవేంద్రతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తికి పాదయాత్ర ఎందుకు? అని నిలదీశారు. తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలోనే అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. రాబోయే సర్పంచ్‌ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అఖండ విజయంతో గెలిపిస్తే పంచాయతీలు మరింత అభివృద్ధి చెందుతాయని పిలుపునిచ్చారు. జగన్‌ సొంత ఇలాకా పులివెందులలో సైతం ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి కూటమికి పట్టం కట్టారన్నారు. ఎన్నికలు ఏవైనా కూటమి ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Updated Date - Nov 24 , 2026 | 11:48 PM