Share News

ఓటెత్తారు..

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:12 AM

పల్లెపో రుకు ఓటర్లు పోటెత్తారు. పల్లెపోరు తొలి విడతలో 8 మండలాల్లో 155 సర్పంచ్‌లు, 1,332 వార్డుల పరంగా గురువారం ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ నిర్వహించారు.

ఓటెత్తారు..

జిల్లాలో 82.43 శాతం పోలింగ్‌

155 సర్పంచ్‌లో కూటమి109, వైసీపీ 46 మద్దతుదారులు విజయం

వార్డుల్లోనూ కూటమిదే హవా

ఆనందంలో నాయకులు, కార్యకర్తలు

నంద్యాల, నవంబరు26(ఆంధ్రజ్యోతి): పల్లెపో రుకు ఓటర్లు పోటెత్తారు. పల్లెపోరు తొలి విడతలో 8 మండలాల్లో 155 సర్పంచ్‌లు, 1,332 వార్డుల పరంగా గురువారం ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ నిర్వహించారు. జిల్లాలో 82.43శాతం పోలింగ్‌ నమోదైంది. ఇదే క్రమంలో 155 సర్పంచ్‌ల్లో కూటమి-109, వైసీపీ-46 చొప్పున మద్దతుదారులు విజయం సాధించారు. ఇక వార్డుల పరంగా కూడా కూటమి మద్దతుదారులదే హవా కొనసాగింది. పల్లెపోరు తొలివిడతలో కూటమి సత్తా చాటింది. వైసీపీ ఢీలా పడింది.

జిల్లాలో ఓటింగ్‌..

జిల్లాలో మొత్తం పోలింగ్‌ : 82.43శాతం

అత్యధికం : గోస్పాడు(85.33)

అత్యల్పం : చాగలమర్రి ( 78.93)

మహిళల ఓటింగ్‌ : 94,888

పురుషుల ఓటింగ్‌ : 93,349

మహిళ పరంగా పెరిగిన ఓటింగ్‌ : 1539 ఓట్లు

వైసీపీలో నిరుత్సాహం

ఇటు సర్పంచ్‌..అటు వార్డుల పరంగా కూటమి మద్దతుదారులు సత్తాచాటారు. దీంతో ఎక్కడికక్కడ ఆయా శ్రేణుల్లో ఆనందం మొదలైంది. ఇదే క్రమంలో వైసీపీ నిరుత్సాహం అలుముకుంది. ఇదిలా ఉండగా.. 155 సర్పంచ్‌ స్థానాల్లో ఇప్పటికే 33 స్థానాలు, వార్డుల పరంగా 357 స్థానాల్లో ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.

తొలి విడత పరిస్థితి ఇలా..

పార్టీల వారీగా బలపరిచిన అభ్యర్థులు విజేతల్లో

పంచాయతీలు మొత్తం టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ ఇతరులుపురుషులు స్త్రీలు

ఆళ్లగడ్డ 17 11 03 --- 14 03 ----- 10 07

చాగలమర్రి 15 10 -- --- 10 05 ----- 07 08

రుద్రవరం 21 11 -- -- 11 10 ---- 09 12

శిరివెళ్ల 16 09 -- -- 09 07 --- 08 08

దొర్నిపాడు 11 11 -- -- 11 -- --- 06 05

ఉయ్యాలవాడ 10 07 - - 07 03 --- 06 04

గోస్పాడు 15 10 -- -- 10 05 -- 08 07

నంద్యాల 17 07 -- -- 07 10 -- 10 07

122 76 03 -- 79 43 -- 64 58

ఏకగ్రీవాలు 33 30 -- -- 30 03 -- 22 11

మొత్తం 155 106 03 - 109 46 -- 86 69

Updated Date - Nov 27 , 2026 | 12:12 AM