Share News

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:01 AM

ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

రాజధానిపై తుగ్లక్‌లా మాట్లాడుతున్నారు
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తుగ్లక్‌లా మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతిపై జగన్‌ రోజుకోమాట మాట్లాడుతుండడంతో ప్రజలతో పాటు ఆపార్టీవారే నవ్వుకుంటున్నారన్నారు. ఒక రోజు విశాఖపట్నం అంటాడు, మరో రోజు మూడు రాజధానులు, మరోసారి మావిగన్‌ అని, మరోసారి బెజవాడ అంటాడని విమర్శించారు. కనీసం స్పష్టమైన వైఖరిలేని వ్యక్తి జగన్‌ అన్నారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడాలంటే ప్రస్తుతం అమలవుతున్న ప్రాజెక్టులు, వస్తున్న పెట్టుబడులు, యువతకు కలుగుతున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించి వాస్తవాలు మాట్లాడాలన్నారు. తుగ్లక్‌లా వ్యవహరించి జగన్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడి పరువు పోతున్నా సిగ్గులేదన్నారు. వాస్తవాలు, ఆధారాలతో మాట్లాడాలని మాజీ సీఎం జగన్‌కు, ఆపార్టీ నాయకులకు హితవు పలికారు.

Updated Date - Jul 06 , 2026 | 12:01 AM