Share News

ఎలాంటి ఇబ్బందులు రాకూడదు

ABN , Publish Date - Mar 07 , 2026 | 10:59 PM

మండలంలోని కొత్తబురుజులో ఈనె 9న సీఎం పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎలాంటి ఇబ్బందులు రాకూడదు
ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి

ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి

డోన్‌ టౌన్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొత్తబురుజులో ఈనె 9న సీఎం పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కొత్తబురుజులోలో ఎమ్మెల్యే కోట్లతో పాటు సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ వెంకటేశ్‌, కలెక్టర్‌ రాజకుమారి, జేసీ కార్తీక్‌, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, టీడీపీ రాష్ట్రనాయకులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, వలసల రామ కృష్ణతో కలిసి హెలిప్యాడ్‌, సభా స్థలాన్ని, పార్కింగ్‌, భోజన స్థలాల ఏర్పాట్లను పరిశీలిం చారు. అధికారులు, నిర్వాహకులతో మాట్లాడారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశిం చారు. ఆర్డీవో నరసింహులు, డీఎస్పీ శ్రీనివాసులు, డీఎల్‌డీవో నరసింహారెడ్డి, తహసీల్దార్లు రవికుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్‌, గుండాల జయరాముడు, ఆలేబా దు పరమేష్‌, నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, ఆలంకొండ గిడ్డారెడ్డి, జిలేబి ధను, ఓంప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 10:59 PM