ఇసుక సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
ABN , Publish Date - May 21 , 2026 | 10:50 PM
రాష్ట్రంలో ప్రజలకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర
కర్నూలు కలెక్టరేట్, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవా లని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మైన్స్ అండ్ జియాలజీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం సగటున ప్రభుత్వానికి రావాల్సిన రూ.300కోట్లు ఆదాయం తగ్గిపోయినా ప్రజలకు ఇసుక సరఫరాలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమ లకు సంబంధించి ఇవాళ భారతదేశంలో వచ్చిన పెట్టుబడులలో 25 శాతం పెట్టుబడులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయన్నారు. సారా తయారీ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో కలెక్టర్ డా.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, అధికారులు పాల్గొన్నారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు
సి. బెళగల్: ఇసుక అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గనులు, ఎక్త్సెజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురు వారం మండలం లోని ఈర్లదిన్నె ఇసుక రీచును తనిఖీ చేశారు. ఏఈడీఏ నాగిణితో మాట్లాడుతూ అక్రమంగా ఇసుక తరలిస్తే ఎంతటి వారినైనా వదల కూడదని ఆదేశించారు. ఇసుక తీస్తున్న బోటులో నదిలో పర్యటించి కొంతసేపు బోటు డ్రైవర్‌తో ముచ్చటించారు. మంత్రి వెంట కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీజిల్లా అధ్యక్షు గుడిసె కృష్ణమ్మ, కర్నూల్ అర్డ్‌వో సందీప్ కుమార్, తహసీల్దార్ వెంకటలక్ష్మి ఉన్నారు.