నీటి వనరుల్లో ఆక్రమణలు ఉండకూడదు
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:08 AM
నీటి వనరుల్లో ఆక్రమణలు ఉండకూడదని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు.
జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నీటి వనరుల్లో ఆక్రమణలు ఉండకూడదని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్‌హాలులో నీటి వనరులు, చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జేసీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నీటి వనరుల్లో ఆక్రమణలు జరిగినట్లయితే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్రమణలు ఎక్కడైనా జరుగుతున్నట్లయితే ఇరిగేషన్ అ ధికారులు అప్రమత్తంగాఉండి వాటిని తొ లగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్, రెవె న్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, కర్నూలు అర్బన్, రూరల్, కల్లూరు తహసీల్దార్లు రవి, రమేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.