Share News

సమృద్ధిగా వర్షాలు కురవాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:22 AM

దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురియాలని, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

సమృద్ధిగా వర్షాలు కురవాలి
కలశయాత్రను ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

పాత నగరంలో ఘనంగా కలశయాత్ర

కర్నూలు కల్చరల్‌, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు కురియాలని, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. పాతనగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద కలశయాత్రను ఆయన ప్రారంభించారు. చిన్న అమ్మవారిశాలలో కొలువైన వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి మూలా నక్షత్రం సందర్భంగా గురువా రం మహిళా భక్తులు 108 కలశాలతో తీసుకువచ్చిన పవిత్ర జలాల లో అభిషేకం నిర్వహించేందుకు ఈ కలశయాత్ర చేపట్టారు. మహి ళలు రాంభొట్ల దేవాలయం నుంచీ చిన్న అమ్మవారిశాల వరకు 108 కలశాలతో ఊరేగింపుగా తరలి వెళ్లారు. మంత్రి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఈ ఆచారాన్ని భక్తులు కొనసాగించడం అభినందనీ యమన్నారు. చిన్న అమ్మవారిశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కలశయాత్ర, రథం ఊరేగింపులో మంత్రి టీజీ భరతతో పాటూ కమిటీ ఛైర్మన టీజీ శివరాజ్‌, అధ్యక్షుడు జూటూరు గోపాలయ్య, కార్యదర్శి చిలుకూరి నందకిషోర్‌, ఉపాధ్యక్షుడు శేషగిరి శెట్టి, మహిళా విభాగం నాయకురాలు జ్ఞానేశ్వరమ్మతోపాటూ పలువురు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:23 AM