Share News

వర్షాలు సమృద్ధిగా కురవాలి

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:26 AM

నగరంలోని మేదరి వీధి సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

వర్షాలు సమృద్ధిగా కురవాలి
జాతర ప్రారంభించి ట్రాక్టర్‌ నడుపుతున్న మంత్రి టీజీ భరత

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు కల్చరల్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): నగరంలోని మేదరి వీధి సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం నగరంలోని మేదరి వీధిలో జరుగుతున్న సుంకులాంబ అమ్మవారి జాతర కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని ఆయన స్వయంగా ట్రాక్టరు నడిపి ప్రారంభిం చారు. ఊరేగింపు మేదరి వీధి నుంచి వనటౌన, పూల బజార్‌ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా నగరంలోని మేదరి వీధిలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుంకులాంబ అమ్మవారి జాతర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించ డం అభినందనీయమని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో, సుంకులాంబ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని, అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళ సంత రించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Jul 29 , 2026 | 12:26 AM