Share News

రాజకీయాల్లో మార్పు రావాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 11:31 PM

దేశంలో రాజ్యాంగ వ్య వస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో మార్పు రావాలి
చదువుల రామయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీఐ నేతలు

అందుకోసం పోరాటాలు అవసరం

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

పత్తికొండ టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): దేశంలో రాజ్యాంగ వ్య వస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, ప్రస్తుతం రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. పత్తికొండ పట్టణంలో గురువారం సీపీఐ పూర్వపు జిల్లా కార్యదర్శి చదువుల రామయ్య శత జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టాయని, కేవలం డబ్బున్న వారే రాజకీయాల్లో రాణిస్తున్నారన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చదువుల రామయ్య లాంటి ఎందరో నాయకులు పార్టీ జెండాను దించకుండా తుదిశ్వాస వరకు పేదల పక్షాన పోరాడి అమరులయ్యారన్నారు. చదువుల రామయ్య కర్నూలు జిల్లాలో అట్టడుగువర్గాలు, హరిజన, గిరిజనుల సంక్షేమం కోసం పోరాడిన గొప్పనేత చదువుల రామయ్య అని తెలిపారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్లాలని పి లుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రామాంజనేయులు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు, మాజీ ఎంపీపీ గురుస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్‌, వైసీపీ నాయకుడు సోమశేఖర్‌, సీపీఐ మండల కార్యదర్శి కారుమంచి, నాయకులు భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, రాజాసాహెబ్‌, లెనిన్‌, సుల్తాన్‌, జగన్నాథం, మునెప్ప, శ్రీనివాసులు, గిడ్డమ్మ, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 11:31 PM