Share News

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:33 PM

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కలెక్టర్‌ డా.ఏ. సిరి వాహనదారులకు సూచిం చారు.

పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదు
పెట్రోల్‌ బంకును తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని, వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కలెక్టర్‌ డా.ఏ. సిరి వాహనదారులకు సూచిం చారు. సోమవారం భూపాల్‌ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్‌ బంక్‌, అమ్మ హాస్పిటల్‌ వద్ద ఉన్న రిలయన్స్‌ పెట్రోల్‌ బంకు, గుత్తి పెట్రోల్‌ బంకులను కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్‌ తీసుకుని వస్తే పెట్రోల్‌ వేయవద్దని, షాప్‌ యాజమాన్యాలను ఆదేశించారు. హెచ్‌పీసీఎల్‌ తదితర ఆయిల్‌ కంపెనీలతో మాట్లాడామని, సాయంత్రం 95 నుంచి 100 వరకు లోడ్‌ వస్తుందని అన్నారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పెట్రోల్‌ బంకుల వద్ద జనాన్ని నియంత్రించడానికి పోలీసు సిబ్బందిని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌వో రాజా రఘువీర్‌, సివిల్‌ సప్లయిస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 27 , 2026 | 11:33 PM