పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:20 AM
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని, ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు.
నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని, ప్రజలు సంతృప్తి చెందేలా విధులు నిర్వర్తించాలని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. మంగళవారం ఆయన అశోక్‌నగర్, పాతబస్తీ, కల్లూరు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలిం చారు. చిన్నపాటి కాలువల్లో ప్రతి వారం పూడికతీత పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న సమయంలో గ్యాంగ్ వర్కర్లతో పూడికతీత పనులు నిర్వహి ంచాలని సూచించారు. పూడికతీత అనంతరం తీసిన వ్యర్థాలను 24 గంటలలోపు పూర్తిగా తొలగిం చాలన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డా.ఎం. రఘు, శానిటేషన ఇన్సపెక్టర్లు రాజు, మునిస్వామి, రమేష్ పాల్గొన్నారు.