Share News

సర్వత్రా అలజడి

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:10 AM

: శ్రీశైలం తలనీలాల టెండర్‌ వెనుక గోల్‌మాల్‌ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 18న ప్రచురిం చిన ‘శివయ్యా.. చూస్తున్నావా?’ అనే కథనం అటు ఆలయ అధికారులతో పాటు తెర వెనుక వ్యవహారం నడిపిన వారిలో అలజడి రేపినట్లైంది.

సర్వత్రా అలజడి

నంద్యాల, మార్చి 24(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం తలనీలాల టెండర్‌ వెనుక గోల్‌మాల్‌ వ్యవహారంపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 18న ప్రచురిం చిన ‘శివయ్యా.. చూస్తున్నావా?’ అనే కథనం అటు ఆలయ అధికారులతో పాటు తెర వెనుక వ్యవహారం నడిపిన వారిలో అలజడి రేపినట్లైంది. పక్కాగా ప్లాన్‌చేసి తలనీలాల టెండర్‌ దక్కించు కునేందుకు లోగుట్టుగా వ్యవహారం నడిపారనే విషయం బహిర్గత మైనట్లు తెలు స్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ పెద్దల దృష్టి ఫిర్యాదు చేశారని సమాచారం. ఏది ఏమైనా బుధవారం జరిగే శ్రీశైలం ఆలయ బోర్డు కమిటీ సమావేశంతో ఉత్కంఠకు తెరపడనుంది. ఈనేపథ్యంలో సదరు టెండర్‌ పరంగా జరిగిన గోల్‌మాల్‌కు సదరు కమిటీ ఆమోదం తెలుపుతుందా? లేక అడ్డుకుట్ట వేస్తారా? అని అందరిలో ఉత్కంఠ మొదలైంది. కమిటీలోనూ కొందరు తెరవెనుక రాజకీయం చేసి తీర్మానం చేసే విధంగా పైరవీలు చేస్తున్నారని తెలిసింది.

ఆమోదంపై ఒత్తిడి..

సదరు టెండర్‌ వ్యవహారంపై నేటి సమావేశంలో ఆమోదం తెలపాలని ఓ ప్రజా ప్రతినిధితో పాటు వారి అనుచర బృందం సైతం తీవ్రస్థాయిలో పైరవీలు చేస్తున్నా రని ఆవర్గాల నుంచి తెలిసింది. వైసీపీ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్‌కు సహ కరించడం మరింత దుమారం రేపుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. శివయ్య ఆదా యానికి రూ.కోట్లలో గండి కొట్టి.. వైసీపీ హయాంలోని కాంట్రాక్టర్‌కు అప్పగించే విధంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావి స్తోంది. పలు రూపాల్లో ఒత్తిడి తేవడంతో కమిటీలోని 16మందిలో కొందరు ఆమోదానికి సిద్ధమయ్యారని సమా చారం. మరికొందరు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.

ఆ శాఖ మంత్రి ఆరా తీశారని..

శ్రీశైలం తలనీలాల టెండర్‌ వెనుక గూడుపుఠాణీ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు టెండర్‌ వెనుక జరిగిన తీరుపై పలువురు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో దేవాదయ శాఖ మంత్రి ఆనం కూడా ఆరా తీశారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సదరు టెండర్‌ పక్రియకు ఆమోదం తెలపకుండా.. శివయ్య ఆదాయానికి గండి పడకుండా చూడాలని ఆదేశించినట్లు సమాచారం. సదరు టెండర్‌ ఆగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

30 అంశాలతో అజెండా

శ్రీశైలంలో బుధవారం జరిగే బోర్డు మీటింగ్‌లో 30అంశాలతో కూడి న ఆజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. తలనీలాల టెండర్‌, డా భా ఏర్పాటు, మరోక హోటల్‌, పలు రకాల తాత్కాలిక నిర్మాణాలు, డార్మేటరీ అంశాల పరంగా బోర్డు సభ్యులు చర్చించి పలుకీలక అంశా లకు ఆమోదం తెలుపనున్నారు. తలనీలాల టెండర్‌ దారు డికి మా త్రం ఆలయ అధికారులు సానుభూతి చూపించి తక్కువ ధరకు అప్ప గించే విధంగా ప్రకటనలో పేర్కొనడం పలు విమర్శలకు తావిస్తోంది.

Updated Date - Mar 25 , 2026 | 12:10 AM