Share News

దొంగల అరెస్టు

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:52 PM

మండలంలోని కల్లపరి గ్రామంలో దుర్గమ్మ గుడిలో హుండీని ఎత్తుకెళ్లిన నలుగురు దొంగలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.

దొంగల అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ తబ్రేజ్‌

కోడుమూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): మండలంలోని కల్లపరి గ్రామంలో దుర్గమ్మ గుడిలో హుండీని ఎత్తుకెళ్లిన నలుగురు దొంగలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ తబ్రేజ్‌ తెలిపిన వివరాల ప్రకారం... కోడుమూరు పట్టణానికి చెందిన చెంచు రఘు, మోతి సురేంద్ర మరో ఇద్దరు మైనర్‌ బాలురు కలిసి మార్చి 22న అర్థరాత్రి కల్లపరి గ్రామంలోని దుర్గమ్మ గుడిలోని ఒక హుండీని పెకలించుకొని వెళ్లారు.హుండీలోని చిల్లర నగదును, హుండీని గ్రామ శివారులోపడేసి నోట్లను మాత్రం తీసుకొని వెళ్లారు. కోడుమూరు పట్టణం సమీపంలోని గ్రీన్‌ సిటీలో దాచిపెట్టిన సొమ్మును పంచుకొంటుండగా దాడి చేసి అరెస్టు చేశామని, వారి నుంచి రూ.9,59,300 నగదు, ఒక మోటర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ఈ కేసును చేధించడంలో ప్రతిభను కనబరిచిన ఎస్‌ఐ డివై స్వామి, ఏఎ్‌సఐ శంకర్‌నాయక్‌, హెడ్‌కానిస్టేబుల్‌ బాషా, కానిస్టేబుల్‌ భాస్కర్‌, ఓంకార్‌ తదితరులు ఉన్నతాధికారుల నుంచి రివార్డు అందుకోనున్నారని తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 11:52 PM