Share News

డోన్‌లో వరుస దొంగతనాలు

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:22 AM

పట్టణంలో తరుచూ దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతోప్రరజలు బెంబేలెత్తుతున్నారు. రైల్వే జంక్షన్‌ కావడంతో నిత్యం రైళ్ల రాకోకలు అధికంగా ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులు డోన్‌కు వచ్చి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది.

 డోన్‌లో వరుస దొంగతనాలు
సీసీ ఫుటేజీలో రికార్డయిన దొంగల చోరీ ప్రయత్నాలు

బెంబేలెత్తుతున్న ప్రజలు

డోన్‌ రూరల్‌ , ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో తరుచూ దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతోప్రరజలు బెంబేలెత్తుతున్నారు. రైల్వే జంక్షన్‌ కావడంతో నిత్యం రైళ్ల రాకోకలు అధికంగా ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులు డోన్‌కు వచ్చి చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ నెల 6న ఆంజనేయ స్వామి కొండ ఆలయంలో ఓ జంట దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. గడ్డపారతో గుడి తలుపులు పగులకొట్టేందుకు ప్రయత్నించి, రాకపోవడంతో ఏమీ చేయలేక కొండదిగి, అక్కడ కొండపేట ప్రాంతంలో బైక్‌ను చోరీ చేయడానికి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అలాగే పశువులు కూడా అపహరణానికి గురవుతున్నట్లు పట్టణ పోలీసులకు పిర్యాదులు వస్తున్నాయి.

పోలీసులు నిఘా పెంచాలి

తరచుగా దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి, పోలీసుల నిఘా పెంచాలి. రాత్రిల్లు గస్తీ పెంచాలి. దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. - నాగరాజు, తారకరామ నగర్‌, డోన్‌

గస్తీ పెంచాం..

దొంగతనాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. అనుమానితులపై నిఘా పెంచాం, రాత్రిళ్లు సిబ్బందితో గస్తీ పెంచాము. దొంగల కోసం గాలిస్తున్నాం. - ఇంతియాజ్‌ బాషా, పట్టణ సీఐ

Updated Date - Feb 10 , 2026 | 12:22 AM