Share News

సూగూరులో చోరీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:46 AM

మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన బోయ తిక్కన్న కొడుకులు నర్సారెడ్డి, నరసింహులు ఇంట్లో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది.

సూగూరులో చోరీ
సూగూరులో నర్సారెడ్డి, నరసింహులుకు చెందిన బీరువాలు

రూ. 3.09 లక్షల నగదు అపహరణ

కేసు నమోదు

మంత్రాలయం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన బోయ తిక్కన్న కొడుకులు నర్సారెడ్డి, నరసింహులు ఇంట్లో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. వీరిద్దరు ఒకే గుడిసెలో ఉంటున్నారు. వీరి తల్లి శాంతమ్మ, పిల్లలు ఇంటి వద్ద ఉండగా వీరు పొలాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో మనవడ్ని తీసుకొని రేకుల కొట్టం తలుపులకు తాళం వేసి శాంతమ్మ పక్కింటి దగ్గరికి వెళ్లింది. వీరి ఇల్లు గ్రామానికి చివరలో ఉండటంతో.. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని పగులగొట్టి కొట్టంలోకి ప్రవేశించి రెండు బీరువాల్లో ఉన్న నగదు, వెండి, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నర్సారెడ్డి బీరువాలో ఉన్న పత్తి అమ్మిన రూ.2.94 లక్షల నగదు, 36 తులాల వెండి, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కనే ఉన్న తమ్ముడు బీరువాను పగుల గొట్టి రూ.15వేలు నగదు, 34 తులాల వెండి, అరతులం బంగారు ఆభరణం అపహరించుకుని వెళ్లారు. శాంతమ్మ ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి ఉండటం గమనించి కొడుకులకు సమాచారం ఇచ్చింది. మంత్రాలయం పోలీసులు పరిశీలించి చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు క ల్లుదేవకుంట గ్రామం మీదుగా వె ళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండిన పంటలో అతికష్టంపై వచ్చిన పత్తిని అమ్మి డబ్బును ఇంటికి తెస్తే దొంగల పాలైందని బాధితులు వాపోయారు.

Updated Date - Oct 09 , 2026 | 12:46 AM