మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:30 PM
పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ
కర్నూలు న్యూసిటీ, జూలై 3(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్ చేశారు. ఏపీ మహిళా సమాఖ్య నగర సమితి అధ్వర్యంలో నగర కార్యదర్శి వి. భారతి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రానున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించి 2023లో పార్లమెంటులో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ అధినీయం బిల్లుని ప్రవేశపెట్టి అమలులోకి తీసుకొని రావాలని అన్నారు. నియోజకవర్గ పునర్విభజన, జనగణన ప్రక్రియకు ముడి పెడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును నీరుగార్చే కుటిన ప్రయత్నం చేసిన బీజేపీకి కూటమి ప్రభుత్వం వంతపాడిందని విమర్శించారు. మహిళలతో సంతకాలు చేయించి రాష్ట్ర పతికి, దేశ ప్రధానికి పంపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఆశాబేగం, సోఫియా, ధనలక్ష్మి, దేవిబాయ్ పాల్గొన్నారు.