జగమంతా రామమయం
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:20 AM
శ్రీరామనామం నేడు అంతటా ప్రతిధ్వనించనుంది. శుక్రవారం శ్రీరామనవమి సంద ర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.
నేడు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం
నంద్యాల కల్చరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): శ్రీరామనామం నేడు అంతటా ప్రతిధ్వనించనుంది. శుక్రవారం శ్రీరామనవమి సంద ర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో సీతారాముల కళ్యాణం వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతో పాటు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీతా రాముల కళ్యాణ సందడి బాగా కనిపిస్తోంది. కళ్యాణ వేడుకలకు ఆలయాల కమిటీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటుచేశారు. తీర్ధ ప్రసాదాల పంపిణీకీ క్యూలైన్లు సిద్ధం చేశారు. ఈ ఏడాది గ్రీష్మతాపం ఎక్కువగా ఉన్నా ఉత్సవాలకు ఎలాంటి లోటు లేకుండా ఘనంగా నిర్వహించనున్నారు.
ఆలయాల్లో కల్యాణ వేడుకలు
నంద్యాల బయటి పేటలో వెలసిన ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్ధానం, సంజీవనగర్ కోదండరామాలయంలో సీతారాముల కల్యా ణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వేణునాధరెడ్డి, భగవత్ సేవాస మాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య తెలిపారు. సాయం కాలం గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. 28వతేదీన సీతారాముల పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందన్నారు. భక్తులకు ప్రత్యేకంగా షామియానాలు, చలువ పందిళ్లు, కూలర్లు, వడపప్పు, పానకానికి ప్రత్యేక కౌంటర్లు, తీర్ధ ప్రసాదాలు స్వీకరించడానికి ప్రత్యేక క్యూలైన్ వ్యవస్ధను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
నేడు శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా శ్రీశైల దేవస్థానం అనుబంధ దేవాలయమైన ప్రసన్నాంజనే యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి లక్ష్మణ సహిత సీతారా ముల వారికి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత స్వామివార్ల కల్యాణోత్సవం జరిపించబడుతాయని ఆలయాధికారులు పేర్కొన్నారు. సిద్ధరామప్ప కాంప్లెక్స్ ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కల్యాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్ర ప్రముఖ్ అరవింద్ తెలిపారు.