Share News

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:34 AM

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోడుమూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. బస్సులోకి ఎక్కి ఎమ్మెల్యే దివ్యాంగులకు బస్సు టికెట్టు ఇచ్చి ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 40 శాతం ఉన్న దివ్యాంగులకు ఏపీఎస్‌ ఆర్‌టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో దివ్యాంగులతో కలిసి ఆయన భోజనం చేశారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్‌, తహసీల్దార్‌ నాగ రాజు, ఎంపీడీవో రాముడు, వీఆర్వోలు ఎల్లప్ప, పరమేష్‌ టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, బ్రీటీష్‌రాముడు, రాజు, బలరాం, కేఈ రఘు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:34 AM